గ్యాంగ్ లీడర్ రీరిలీజ్: ఆ విషయంలో ఫ్యాన్స్ అప్సెట్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నటికీ గుర్తుండిపోయే సినిమా 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమాలో ఫైట్స్, లవ్, ఎమోషన్, సాంగ్స్, అన్ని పర్ఫెక్ట్ గా  ఉంటాయి. 1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పైన నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా  కమర్షియల్ సినిమా అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉంటుంది. బప్పి లహరి కంపోజ్ సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. విజయశాంతి, చిరుల లవ్ ట్రాక్ ఇంకా అలాగే మురళి మోహన్-శరత్ కుమార్-చిరంజీవిల మధ్య బ్రదర్ ఎమోషన్ గ్యాంగ్ లీడర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ సినిమాలో రావు గోపాల్ రావ్ ప్లే చేసిన నెగటివ్ రోల్ కి అయితే ఖచ్చితంగా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్లు అయిన సంధర్భంగా, చిరుని సెలబ్రేట్ చేసుకోవడానికి మెగా అభిమానులు గ్యాంగ్ లీడర్ స్పెషల్ షో ప్లాన్ చేశారు. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు.


ఫిబ్రవరి 11న గ్యాంగ్ లీడర్ రీరిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడి మళ్ళీ మార్చ్ 4న 4K వర్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమాని ఆల్రెడీ థియేటర్స్ లో చూసిన వాళ్లు ఇంకా ఆ మ్యాజిక్ ని మరోసారి విట్నెస్ చెయ్యడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయిన ఈ జనరేషన్ ఆడియన్స్ అయితే అసలు వింటేజ్ మెగాస్టార్  ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి గ్యాంగ్ లీడర్ సినిమాని 4Kలో చూస్తున్నారు.మొత్తానికి మొదటి రోజు గ్యాంగ్ లీడర్ సినిమాని అభిమానులు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వింటేజ్ చిరంజీవిని మళ్ళీ స్క్రీన్ పై చూసుకొని ఫ్యాన్స్ ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారు.అయితే క్వాలిటీ విషయంలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయని చెప్పాలి.మరీ ముఖ్యంగా మొదటి 15 నిమిషాలు. సెన్సేషన్ సృష్టించిన టైటిల్ సాంగ్ అయితే పూర్తిగా క్వాలిటీ మిస్ అయి బ్లర్ గానే అనిపించింది. విలన్లతో డైరక్ట్ అయ్యే బిలియర్డ్స్ సీన్ దాదాపు కట్ అయిపోయి చివరలో చిరంజీవి డైలాగులు మాత్రమే ఉండటం కొంచెం నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: