అక్క చేసిన పనికి ఎమోషనల్ అవుతున్న మంచు మనోజ్..!

Divya
గత కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ ప్రముఖ రాజకీయ దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు బాగా వినిపించిన విషయం విధితమే. అయితే ఈ విషయంపై వీరు క్లారిటీ ఇవ్వలేదు.. కానీ ఎట్టకేలకు వివాహ తేదీనీ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి అలాగే సంతోషానికి గురి చేశారు. ఎట్టకేలకు మార్చి మూడవ తేదీన శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో వేద పండితుల మధ్య భూమా మౌనిక రెడ్డి మెడలో మంచు మనోజ్ 3 ముళ్ళు వేశారు.
ఈ వివాహం ఫిలింనగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలో చాలా ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు,  పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను తమ చల్లని దీవెనలతో ఆశీర్వదించారు. అయితే ఇలాంటి ఆనంద క్షణాన మంచు లక్ష్మీ చేసిన పనికి ఎమోషనల్ అవుతున్నారు మంచు మనోజ్.. అసలు విషయంలోకి వెళితే మంచు లక్ష్మి తన తమ్ముడిని కొడుకుగా భావిస్తానని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో వెల్లడించారు కాబట్టి ఇప్పుడు తన కొడుకు లాంటి తమ్ముడి పెళ్లి ని ఆమె తన భుజాన వేసుకొని అన్ని పూర్తి చేసింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గరనుంచి పెళ్లి తంతు వరకు అన్నింటిని కూడా మంచు లక్ష్మి స్వయంగా దగ్గరుండి చూసుకోవడం గమనార్హం.
తన పెళ్లిపై తన అక్క తీసుకున్న బాధ్యత గురించి ఆయన తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఎమోషనల్ నోటు షేర్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.. తనను పెళ్ళికొడుకుని చేస్తున్న మంచు లక్ష్మి ఫోటోలు ఆయన తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ.." అక్కా.. నాది ఏ జన్మ పుణ్యమో.. లవ్ యు అక్క.. థాంక్యూ ఫర్ ఎవరీ థింగ్" అంటూ భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ ఇన్స్టా స్టోరీ చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: