ఘోరమైన "టిఆర్పి" రేటింగ్ ను సొంతం చేసుకున్న "పొన్నియన్ సెల్వన్ 1"..!

Pulgam Srinivas
అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మణి రత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణి రత్నం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మణి రత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు.

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం కొంత కాలం క్రితమే భారీ ఎత్తున తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఉంటే భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా తమిళ వర్షన్ బాగానే కలక్షన్ లను వసూలు చేసినప్పటికీ తెలుగు వర్షన్ మాత్రం అనుకున్న రేంజ్ కలెక్షన్ లను వసూలు చేయ లేదు.

ఇలా తెలుగు ప్రేక్షకులను థియేటర్ లలో కాస్త నిరుత్సాహ పరిచిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు లో జెమినీ టీవీ లో ప్రసారం అయింది. ఇది ఇలా ఉంటే మొదటి సారి ఈ మూవీ తెలుగు లో జెమినీ టీవీ లో ప్రసారం అయినప్పుడు కేవలం 2.73 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే సంపాదించుకుంది. థియేటర్ లలో తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా బుల్లి తెరపై కూడా ప్రేక్షకులను అరవించడంలో విఫలం అయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: