చిరంజీవి ఆఖరి 5 మూవీల ఫైనల్ కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఆఖరుగా నటించిన 5 మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన ఫైనల్ కలెక్షన్ల ల వివరాలు తెలుసుకుందాం.
వాల్టేర్ వీరయ్య : చిరంజీవి తాజాగా పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ అయినటు వంటి వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 137.85 కోట్ల కలెక్షన్ లను అందుకుంది. ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.
గాడ్ ఫాదర్ : చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా 59.38 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 48.36 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... రామ్ చరణ్ కి జోడిగా ఈ మూవీ లో పూజా హెగ్డే నటించింది.
సైరా నరసింహా రెడ్డి : చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సరికి 143.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో చిరంజీవి సరసన నయన తార ... తమన్నా హీరోయిన్ లుగా నటించగా ... కిచ్చా సుదీప్ ... విజయ్ సేతుపతి ... జగపతి బాబు ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.
ఖైదీ నెంబర్ 150 : చిరంజీవి హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 104.6 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: