ఈసారి సంక్రాంతికి విడుదల అయిన క్రేజీ మూవీలలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో 50 రోజులను జరుపుకుంటుందో తెలుసా..!

Pulgam Srinivas
ప్రతిసారీ లాగానే ఈసారి కూడా సంక్రాంతి పండుగకు అనేక సినిమాలు విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని స్టేట్ సినిమాలు కాగా ... మరికొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సారి సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన సినిమాల్లో కొన్ని సినిమాలు 50 రోజులను పూర్తి చేసుకోగా మరి కొన్ని సినిమాలు 50 రోజులను పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సారి సంక్రాంతి కి విడుదల అయిన 4 క్రేజీ మూవీ లలో ఏ సినిమా ఎన్ని థియేటర్ లలో 50 రోజుల వేడుకలు జరుపుకోబోతుందో తెలుసుకుందాం.
వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమా 74 సెంటర్ లలో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
వీర సింహా రెడ్డి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమా 23 సెంటర్ లలో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది.
వారిసు : తమిళ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా వారిసు అనే మూవీ లో హీరో గా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 9 సెంటర్ లలో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది.
తునివు : తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ తాజాగా తునివు అనే మూవీ లో హీరోగా నటించాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఒక సెంటర్ లో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: