తెలుగు రాష్ట్రాల్లో అన్ని నష్టాలను ఎదుర్కొన్న "తెగింపు" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి కొన్ని మూవీ లతో మంచి విజయాలను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపుnను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ తమిళం లో తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మించగా ... మంజు వారియర్ ఈ మూవీ లో అజిత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాలు ఈ మూవీ పై ఏర్పడడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 3.5 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.16 కోట్ల షేర్ ... 4.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ కి ఫైనల్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.34 కోట్ల నష్టాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: