ఇదేమి సినిమా భయ్యా... 2 కోట్ల బడ్జెట్ తో 55 కోట్లకు పైగా కలెక్షన్ లు !

VAMSI
ఒక సినిమా థియేటర్ లో విడుదలయ్యి అది కనీసం వారం పది రోజులు నిలబడి పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకునే నిర్మాతలు ఉన్నారు. కానీ అన్ని సినిమాలు కూడా పెట్టిన బడ్జెట్ ను కూడా తీయలేకపోవచ్చు. ఇక పెద్ద బడ్జెట్ సినిమాలు సంగతి సరే సరి ఏదో ఒక విధంగా మార్కెటింగ్ చేసుకుని పెట్టుబడి కాకుండా లాభాలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల మధ్యన నడుస్తున్న సినిమా పరిశ్రమలో చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు అధిక లాభాలను ఆర్జిస్తే ? ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ జరగాలంటే దాని వెనుక చాలా అంశాలు కలిసి రావాలి.
కానీ నిజం కావడానికి మంచి కథ, నటనను ముఖంలోనే పలికించగల నటులు ఉండాలి మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ఎంత చిన్న సినిమా అయినా సక్సెస్ ఫుల్ అవుతుంది. ఇప్పుడు అటువంటి ఫలితాన్ని అందుకుని దక్షిణ సినిమా పరిశ్రమలో సంచలనాన్ని రేపుతోంది. మలయాళంలో నెల రోజులకు ముందు "రోమాంచమ్"... ఈ సినిమాకు జీతు మాధవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రధాన భూమిక వహించిన నటుడు షౌబిన్ షాహిర్  క్యారక్టర్ ఆర్టిస్ట్ కన్నా ఎక్కువ స్థాయి కలవారు అని చెప్పాలి. ఇతని నటన గురించి చెప్పాలంటే... సహజత్వం ఉట్టిపడే నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు.
చాలా చిన్న పాయింట్ తో హర్రర్ కామెడీని సృష్టించి ప్రేక్షకులను రెండు గంటల సేపు థియేటర్ లో కూర్చోపెట్టిన ఘనత పూర్తిగా నటులు మరియు దర్శకుడికే దక్కుతుంది చెప్పాలి. ఇంకా ఈ సినిమా థియేటర్ లో ఉండగానే ప్రస్త్తుం కలెక్టన్ లు 55 కోట్లకు పైగానే ఉన్నాయి. ఇక ఫుల్ రన్ లో ఇంకెన్ని కోట్లు సాధిస్తుంది అనేది చూడాలి. కాగా ఈ సినిమా ఇతర భాషల రీమేక్ హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: