జైలుకు వెళ్లిన వరలక్ష్మి.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజం..?

Anilkumar
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదట హీరోయిన్గా కెరియర్ను ప్రారంభించినా.. ఆ తర్వాత మాత్రం విలన్ గా సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. విలన్ పాత్రతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతానికైతే అగ్ర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి మెప్పించింది ఈ కోలీవుడ్ హీరోయిన్. ఇదిలా ఉంటే తాజాగా వరలక్ష్మికి సంబంధించిన ఓ సంచలన నిజం వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ అదేంటంటే.. గతంలో ఓసారి వరలక్ష్మి జైలుకు వెళ్లిందట. ఈ విషయాన్ని ఆమె తండ్రి శరత్ కుమార్ స్వయంగా వెల్లడించారు. వరలక్ష్మి నటించిన 'కొండ్రాళ్ పావం' అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు శరత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." నా కూతురు వరలక్ష్మి మొదటినుంచి తన టాలెంట్ తోనే ఎదిగింది. ఆమె చాలా ధైర్యవంతురాలు కూడా. ఒకసారి మీ కూతురు పోలీస్ స్టేషన్లో ఉందంటూ నాకు స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేశారు. నా కూతురు ఇద్దరు అబ్బాయిలను చితకబాదింది. అంతకుముందు వాళ్ళిద్దరూ తన కారును ఢీ కొట్టారు. అందుకే అలా చేసింది.

నా కూతురు టాలెంట్ ఉన్న అమ్మాయి మాత్రమే కాదు చాలా ధైర్యవంతురాలు అయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు శరత్ కుమార్. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ జైలుకు వెళ్లిందనే విషయం తన తండ్రి చెప్పడంతో ఈ విషయం తెలిసి నేటిజన్స్ అంతా షాక్ కి గురవుతున్నారు. ఇక ప్రస్తుతం వరలక్ష్మి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మూవీస్ లో కూడా నటిస్తోంది. తెలుగులో యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న 'హనుమాన్' మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన వరలక్ష్మి ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ కూడా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: