షారుక్ 'పఠాన్' బాటలోనే.. ప్రియదర్శి 'బలగం'?

praveen
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఎంత సెన్సేషన్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల తో వచ్చిన వరుస ప్లాపులతో అందరూ హీరోలు సతమతమవుతున్న సమయంలో ఇక పఠాన్ సినిమా సూపర్ హిట్ సాధించి అందరిలో కొత్త ఊపిరిని నింపింది అని చెప్పాలి. తెలుగు సినిమాల హవా నడిపిస్తున్న సమయంలో.. ఇక బాలీవుడ్ పని అయిపోయిందని కొంతమంది క్రిటిక్స్ విమర్శలు చేస్తుంటే పఠాన్ సినిమా మాత్రం మాత్రం ఇక బాలీవుడ్ లో కొత్త జోష్ నింపింది అని చెప్పాలి. ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇంకా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో సక్సెస్ అవుతుంది అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల పఠాన్ చిత్ర బంధం ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది అన్న విషయం తెలిసిందే. 112 రూపాయలకే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మల్టీప్లెక్స్ లో సినిమా చూసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇక ఇప్పుడు టాలీవుడ్ నటుడు ప్రియదర్శి సైతం షారుఖ్ ఖాన్ బాటలోనే వెళ్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా తాను నటించిన బలగం సినిమా ఈరోజు విడుదలైంది. అయితే ఈ సినిమాకు ను కూడా మల్టీప్లెక్స్ లో 110 రూపాయలకే చూడొచ్చు అని ఒక ఆఫర్ ప్రకటించింది. రెండు చిత్ర బృందాలు కూడా సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేశాయి అని చెప్పాలి.

 అయితే ఇక ఈ రెండు చిత్ర బృందాలు ప్రకటించిన ఆఫర్ కేవలం శుక్రవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది అని స్పష్టం చేశాయి. కాగా పఠాన్ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో 1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్,  సుధాకర్ రెడ్డి  మురళీధరన్ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన బలగం సినిమా నేడు విడుదల అయింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించబడింది అని చెప్పాలి. అయితే తొలి రోజు తమ చిత్రానికి ఎక్కువ మంది ప్రేక్షకులను చేరువ చేసేందుకే ఇక చిత్ర బృందం  ఇలాంటి ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: