జబర్దస్త్ కమెడియన్ తో పోటీ పడుతున్న కృష్ణారెడ్డి !

Seetha Sailaja
1990 ప్రాంతాలలో ఒక 10సంవత్సరాల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హవా కొనసాగింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అతడి సినిమాలకు అప్పట్లో కుటుంబ ప్రేక్షకులతో పాటు అప్పటి యూత్ మాస్ కూడ చూస్తూ ఉండేవారు. దీనితో అప్పట్లో అతడి సక్సస్ రేట్ చాల మంచి స్థాయిలో ఉండేది.

2000ల సంవత్సరం నుండి మారిపోయిన ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయడంలో ఈ దర్శకుడు ఫెయిల్ అవ్వడంతో అతడి సినిమాలు చాలామటుకు పరాజయం చెందడంతో సినిమా దర్శకత్వానికి అతడు దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే చాల సంవత్సరాల తరువాత ఈయన దర్శకత్వం వహించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రేడ్ అల్లుడు’ ఈరోజు విడుదలకాబోతోంది. అయితే ఈమూవీతో పోటీగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడుగా పరిచయం చేస్తూ దిల్ రాజ్ నిర్మాణంలో వస్తున్న ‘బలగం’ మూవీ ఊహించని విజయం సాధిస్తుందా అంటూ కొన్ని అంచనాలు వస్తున్నాయి.

పూర్తి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిచిన ఈమూవీ విడుదల కాకుండానే హైదరాబాద్ లో సెలబ్రిటీలకు మీడియాకు వేసిన ప్రీమియర్ షోలు వేసారు. వారి నుంచి టాక్ వస్తోంది. అయితే సగటు ప్రేక్షకుడుకి కూడ ఈసినిమా నచ్చితే మాత్రం ఎస్.వి. కృష్ణారెడ్డి మూవీకి గట్టిపోటీ వచ్చిందనే అనుకోవాలి. ఈ రెండు సినిమాలతో పాటు ‘ఇన్ కార్’ ‘గ్రంథాలయం’ ‘సాచి’ ‘రిచి గాడి పెళ్ళి’ లాంటి చిన్న సినిమాలు కూడ వస్తున్నాయి. గత వారం విడుదలైన చిన్నసినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో ధనుష్ ‘సార్’ మూవీ తప్పించి మరో ఆప్క్షన్ లేకుండా పోయింది.  

ఈవారం జరగబోతున్న ఈ చిన్న సినిమాల రేస్ లో కమెడియన్ వేణు ముందు కృష్ణారెడ్డి నిలబడలేకపోతే అతడి నుండి మరొక సినిమా వచ్చే అవకాశం ఇప్పట్లో ఉండకపోవచ్చు. రాజేంద్రప్రసాద్ సోహెల్ మీనా లాంటి పేరున్న నటీనటులు ఎందరో ఉన్నప్పటికీ కమెడియన్ వేణు మ్యాజిక్ ముందు వీరంతా ఎంతవరకు నిలబడగలరో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: