ఈ బ్యూటీకి ఛాన్స్ లు రావట్లేదెందుకు..!

shami
టాలీవుడ్ లో ఎంత హీరోయిన్స్ కొరత ఉన్నా ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరోయిన్ కి లక్ కలిసి రాదు. స్టార్ హీరోయిన్ కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నా కూడా కొంతమంది భామలు ఫేడవుడ్ అవుతుంటారు. అయితే ఫేడవుట్ దాకా వేళ్లలేదు కానీ ప్రసతుతం కెరీర్ లో వెనకపడ్డది అందాల భామ నభా నటేష్. సుధీర్ బాబు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ సినిమాతో తన టాలెంట్ చూపించగా వరుస ఛాన్స్ లు అందుకుంది. ఇంకేంటి టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ సిద్ధమైంది అనుకునేలోగా అమ్మడు వెనక్కి తగ్గింది.
కథల ఎంపికలో సరైన అవగాహన లేకపోవడం వల్ల నభా నటేష్ కెరీర్ రిస్క్ లో పడేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ పడినా ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాపులు అవడంతో అమ్మడికి ఛాన్స్ లు రాకుండా ఆగిపోయాయి. నితిన్ తో చివరిగా మ్యాస్ట్రో సినిమా చేసిన నభా నటేష్ లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరమైంది. మరి ఈ ఏడాది అయినా సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి.
సినిమాలు చేయకపోయినా అమ్మడు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. లేటెస్ట్ గా చిరిగిన ప్యాంట్ తో చేతిలో కప్పుతో తన ఓర చూపులతో అలరిస్తుంది నభా నటేష్. ఇంత బ్యూటీకి అసలు సినిమా ఛాన్స్ లు ఎందుకు రావట్లేదా అని అనుకోవడం ఆడియన్స్ వంతు అయ్యింది. యాక్టింగ్ లో కూడా పర్వాలేదు అనిపించుకున్న ఈ అమ్మడు రాబోయే రోజుల్లో అయినా వరుస సినిమాలు చేస్తుందేమో చూడలి. నభా సినిమాలు చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ ఆరాపడుతున్నారు. ప్రస్తుతం అమ్మడు ఒకటి రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది. వాటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా నభా తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: