భారీగా రజిని 170 వ సినిమా.. పూర్తి వివరాలు?

Purushottham Vinay
సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా రజినీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది.ఆయన నటన, అందం ఇంకా మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రజిని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ ఓ సినిమాకు ఎస్ చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ రోజు లైకా ప్రొడక్షన్స్ కంపెనీ ఛైర్మన్ సుభాస్కరన్ పుట్టిన రోజు. ఈ క్రమంలోనే ఆ కంపెనీ రజినీ కాంత్ కాంబోలో రాబోతున్న మూవీ గురించి ఓ అప్ డేట్ ని ఇచ్చింది.రజినీ కాంత్ లైకా ప్రొడక్షన్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి జై భీమ్ దర్శకుడు టి.ఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. అయితే జై భీమ్ చిత్రం సూపర్ డూపర్ హిట్టుగా నిలవడంతో ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నమోదు అయ్యాయి.


అందులోనూ సూపర్ స్టార్ రజినీ హీరో కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ తమిళ సంచలన సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు ప్రకటించారు.ఈ సినిమాని 2024లో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. గతంలో లైకా సంస్థ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన రోబో 2.0 దర్బార్ వంటి చిత్రాలను భారీ బడ్జెట్ తో నిర్మించింది. తాజాగా మరోసారి జ్ఞానవేల్ తో కలిసి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. అన్నతే చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్. ఈ సినిమాకు బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. ఈనెలాఖరులోగా ఈ సినిమాని పూర్తి చేయబోతున్నారు.అంతేకాకుండా రజినీ తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న లాల్ సలాం చిత్రంలో కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: