"వాల్తేరు వీరయ్య" మూవీకి వచ్చిన లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందినటు వంటి వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ... బాబి సింహ విలన్ పాత్రలలో నటించగా ... మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. 

ఈ మూవీ లో రవితేజ కు జోడి గా కేథరిన్ నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. అలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ టాక్ లభించింది.

దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ టోటల్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 137.85 కోట్ల షేర్ ... 236.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 48.85 కోట్ల లాభాలు దక్కాయి. ఇలా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లాభాలను అందుకొని సూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: