RRR క్రెడిట్ ని చెర్రీ ఒక్కడే తీసుకుంటున్నాడా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రభాస్ ని బాహుబలి ముందు బాహుబలి తరువాత ఎలా కొనియాడుతున్నారో రామ్ చరణ్ ని ఆర్ ఆర్ ఆర్ కి ముందు ఆర్ ఆర్ ఆర్ తరువాత అని కొనియాడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్ పాపులారిటీ అందుకొని ఇండియన్ బ్రాడ్ పిట్ గా హాలీవుడ్ వాళ్ళ చెత్త ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన యు.ఎస్‌లోనే సందడి చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ మొత్తం చెర్రీనే కొట్టేస్తున్నాడని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రముఖ పాపులర్ ఎంటర్‌టైన్మెంట్ చానెల్ KTLA తాజాగా చెర్రీని ఇంటర్వ్యూ చేసింది.ఈ మేరకు మాట్లాడిన చరణ్ .. 'రాజమౌళి అత్యుత్తమ సినిమాల్లో 'ఆర్ఆర్ఆర్' కూడా ఒకటి. భారతదేశం ఎదుర్కొన్న వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా. 'నాటు నాటు' పాట చాలా అందమైన పాట. దాదాపు 300 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లతో 7 రోజులు పాటు రిహార్సల్స్ చేసి 17 రోజుల పాటు చిత్రీకరించారు' అని రామ్ చరణ్ చెప్పాడు.


ఇంకా అలాగే 'ఆస్కార్ వేడుకలకు హాజరవడంతోపాటు ఓ గెస్ట్ గా ఉండటం కూడా నా జీవితంలో అద్భుతమైన క్షణాలు. ఇక ఆ బ్లాక్ లేడీని మా టీమ్‌తో కలిసి మా దేశానికి తీసుకెళ్లడానికి నేను చాలా ఎగ్జయిట్మెంట్‌తో ఎదురుచూస్తున్నా. 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ సినిమా గుర్తింపు పొందండం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో చేయబోతున్న లైవ్ పెర్ఫామెన్స్ గురించి కూడా నాకు తెలియని ఎగ్జయిట్‌మెంట్ నెలకొంది" అని అన్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మళ్ళీ అమెరికాలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే 1250 కోట్ల పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లు వసూళ్లు రాబడుతుందో చూడాలి.ఇక ఇప్పటికే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో సందడి చేసిన రామ్ చరణ్ తేజ్...  కేటీఎల్ఏ5 అనే ఛానల్ ప్రోగ్రాంలో కూడా సందడి చెయ్యడం జరిగింది. ఈ కేటీఎల్ఏ అనేది లాస్ ఎంజెల్స్ కాలిఫోర్నియాలో ఉన్న ఒక టెలివిజన్ ఛానల్. అమెరికా మొత్తం మీద ఈ ఛానల్ ను అత్యధికమంది ఫాలో అవుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: