అందరి ముందే ఆ హీరోయిన్ కి.. ఇ లవ్ యు చెప్పిన హైపర్ ఆది?
ఇక జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఢీ షోలో హైపర్ ఆది పంచే కామెడీ అంతా ఇంతా కాదు. జడ్జెస్ కంటెస్టెంట్స్ టీం లీడర్స్ అనే తేడా లేకుండా అందరిపై పంచులు వేస్తూ ప్రేక్షకులందరికీ కడుపుబ్బాని నవ్విస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఢీ షోలోకి జడ్జ్ గా ఏ హీరోయిన్ వచ్చినా కూడా ఆ హీరోయిన్ వెంటపడుతున్నట్లుగా ఒక లవ్ ట్రాక్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఇకపోతే ఇటీవలే ఒక హీరోయిన్ కి ఏకంగా అందరి ముందే ప్రపోజ్ చేసేసాడు.
గత కొంతకాలం నుంచి ఢీ షోలో శ్రద్ధదాస్ జడ్జిగా వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అందం అభినయంతో ఆకట్టుకోవడమే కాదు తన జడ్జిమెంట్తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇకపోతే ఇటీవల ఢీ షో నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా శ్రద్ధదాస్ హైపర్ ఆది కోసం ఒక పాట పాడగా ఇక మైమరిచిపోయిన హైపర్ ఆది వెంటనే లేచి నిలబడి ఐ లవ్ యు అంటూ అందరి ముందే చెప్పేసాడు. హైపర్ ఆది ఇలా ఐ లవ్ యు చెప్పడంతో శ్రద్ధదాస్ ఒక్కసారిగా తనలో తాను నవ్వుకొని సిగ్గు పడింది అని చెప్పాలి.