ఇక మీదట రాజమౌళి ప్రొడ్యూసర్ గా కూడా..!

shami
అదేంటి రాజమౌళి కేవలం డైరెక్టర్ మాత్రమే కదా.. అతనెప్పుడు నిర్మాతగా మారాడు అనుకోవచ్చు. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు పేరుకి దానయ్య డివివి నిర్మాత అయినా ఆ సినిమాను హాలీవుడ్ ప్రమోషన్స్ కి రాజమౌళి తన సొంత ఖర్చులు పెడుతున్నారని టాక్. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు వచ్చిన తన రెమ్యునరేషన్ తో పాటుగా తన సొంత డబ్బుతో జక్కన్న హాలీవుడ్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారట. గోల్డెబ్ గ్లోబ్ అవార్డ్ టైం లోనే కోట్ల కొద్దీ ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ ప్రమోషన్స్ కోసం కూడా భారీ మొత్తాన్నే పెట్టేస్తున్నారట. హాలీవుడ్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ హాట్ టాపిక్ అయ్యేలా కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్.
అయితే రాజమౌళి ఫ్యూచర్ లో తన ప్రాజెక్ట్ లకు తానే నిర్మాతగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అంతా తమ సినిమాను తామే ప్రొడ్యూస్ చేస్తారు. సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్ అంతా కూడా వారే సొంత డబ్బుతో చేస్తారు. ఉదహరణగా జేమ్స్ కామెరూన్ ని తీసుకుంటే ఆయన సినిమాని ఆయనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు. దానికి కావాల్సిన ప్రమోషన్స్ కూడా చేస్తారు. ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే పంథా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.
సినిమా డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలిసిన జక్కన్న. rrr సినిమా ను హాలీవుడ్ లో భరీ ప్రమోషన్స్ చేశారు. ఆ ఖర్చు అంతా తానే భరించాడని టాక్. సో ఈ లెక్కన ఫ్యూచర్ లో రాజమౌళి కేవలం డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. దర్శక నిర్మాత రాజమౌళి అయితే ఇక ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. నిర్మాతగా టర్న్ అవడమే రాజమౌళి నెక్స్ట్ ప్లాన్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: