సునీల్ ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
కెరీర్ ప్రారంభంలో కమీడియన్ పాత్రల్లో నటించి ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్రను పోషించిన సునీల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కామెడీ పాత్రలలో నటించిన సునీల్ ఆ తర్వాత అందాల రాముడు మర్యాద రామన్న వంటి కొన్ని సినిమాలలో హీరో గా నటించి హీరోగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అలా హీరోగా కొన్ని సంవత్సరాల పాటు సినిమాల్లో నటించిన సునీల్ మళ్లీ హీరో పాత్రలో మాత్రమే కాకుండా ఇతర పాత్రలో కూడా నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో కలర్ ఫోటో ... పుష్ప ది రైస్ మూవీ ల ద్వారా సునీల్ నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సునీల్ చేతిలో అనేక క్రేజీ మూవీ లు ఉన్నాయి. ప్రస్తుతం సునీల్ నటిస్తున్న ఆ క్రేజీ మూవీలు ఏవో తెలుసుకుందాం.
పుష్ప ది రూల్ : అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
జైలర్ : రజనీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
జపాన్ : కార్తి హీరో గా రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ నటిస్తున్నాడు.
మా వీరన్ : శివ కార్తికేయన్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
మార్క్ ఆంటోనీ : విశాల్ హీరో గా రూపొందుతున్న ఈ మూవీ లో సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ మూవీ లతో పాటు మరి కొన్ని సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: