విజయ్... గౌతమ్ కాంబినేషన్ మూవీకి ఆ ఇద్దరిలో ఒకరే మ్యూజిక్ డైరెక్టర్..?

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ మరి కొన్ని రోజుల్లో గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 12 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు అనే వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సంగీత దర్శకుడు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంగీత దర్శకుడి గా అనిరుద్ రవిచంద్రన్ తీసుకోవాలి అనే ఆలోచనలో దర్శకుడు గౌతమ్ ఉన్నట్లు ... కాకపోతే ఇప్పటికే అనిరుద్ అనేక సినిమాలను ఒప్పుకోవడంతో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలకు సంగీతాన్ని ఇవ్వడానికి చాలా టైమ్ పడుతూ ఉండడంతో ఈ మూవీ నిర్మాతలు ఈ సినిమాకు జీ వీ ప్రకాష్ కుమార్ ను సంగీత దర్శకుడిగా తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా ప్రస్తుతం గౌతమ్ కు మరియు ఈ సినిమా ప్రొడ్యూసర్ లకు మధ్య మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కొన్ని చర్చలు జరుగుతున్నట్లు ఆఖరుగా ఎవరిని సంగీత దర్శకుడుగా తీసుకోవాలి అనే విషయంలో వీరిద్దరూ కూర్చొని డిసైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ కి ఎవరు సంగీత దర్శకుడిగా సెలెక్ట్ అవుతారు తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఖుషి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శివ నర్వాన ఈ మూవీ కి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: