ప్రభాస్ "ప్రాజెక్ట్ కే" మూవీ లో ఆ క్రేజీ నటుడు..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా  సంతోష్ నారాయనన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అమితా బచ్చన్ ... దిశా పటాని కీలక పాత్రలలో ఈ మూవీ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు 70% పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ మొట్ట మొదటి సారి నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా రేంజ్ లో సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీbని అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత గ్రాండ్ గ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న హీరోలలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ ప్రాజెక్టు కే మూవీnలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ... ఈ పాత్ర ఈ సినిమాకే  హైలైట్ గా ఉండబోతున్నట్లు ... ఇప్పటికే ఈ మూవీ యూనిట్ దుల్కర్ సల్మాన్ కు తన పాత్రకు సంబంధించిన కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన దుల్కర్ సల్మాన్ వెంటనే ఈ మూవీbలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు చిత్ర బృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. నిజంగానే ఈ మూవీ లో కనుక దుల్కర్ సల్మాన్ నటించినట్లు అయితే ఈ సినిమా క్రేజ్ మరింత గా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: