7 భాషలలో హీరో ఉపేంద్ర భార్య 50 వ చిత్రం..!!

Divya
స్టార్ హీరో ఉపేంద్ర కన్నడలో అనేక బ్లాక్ బ్లాస్టర్ హిట్ చిత్రాలలో నటించారు అలాగే తెలుగులో కూడా గతంలో ఎన్నో చిత్రాలలో నటించారు. తాజాగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్న చిత్రం కబ్జా.. ఈ చిత్రాన్ని ఆర్ చందు దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆడియో లాంచ్ ఈవెంట్ను కూడా చాలా గ్రాండ్గా నిర్వహించారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే దివంగత కన్నడ హీరో స్టార్ పునీత్ రాజకుమారుని తలుచుకునే ఉపేంద్ర చాలా బాధపడడం జరిగింది.

ఆడియో లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన ఉపేంద్ర పునీత్ రాజ్కుమార్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కోల్పోయినట్లుగా తెలియజేయడం జరిగింది. పునీత్ రాజకుమార్ యాక్షన్ చెప్పాలనుకున్నాను కానీ మిస్ అయ్యాను అందుకే ఇప్పుడున్న శివన్న (శివరాజ్ కుమార్) కోసం ఒక ప్రాజెక్టును చేస్తున్నానని తెలియజేశారు. వారి గీతా బ్యానర్లు నిర్మించాలనుకుంటున్నానని తెలియజేశారు. పునీత్ చేయలేక పోయిన లోటును తీర్చుకుంటానని తెలియజేశారు. ఇదంతా ఇలా ఉంటే ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర కూడా పలు సినిమాలలో నటిస్తోంది ఇప్పుడు తాజాగా 50వ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదలవ్వడం జరిగింది.

ఈ చిత్రంలో ఇమే ఒక డిటెక్టివ్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది టైటిల్ కూడా అదే విధంగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్రివిక్రమ్ రఘు డైరెక్టర్ చేస్తున్నారు. ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త బ్యానర్ పై జీ ముని ప్రసన్న నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాను ప్రియాంకకి సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక కెరియర్ లో ఇది 50వ సినిమాగా రూపొందిస్తున్నారు ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ్ ,మలయాళం, హిందీ ఒరియా బెంగాలీ భాషలలో మొత్తం ఏడు భాషలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: