ఓటీటి లో చిరంజీవి సక్సెస్ అయ్యారా..!!

Divya
భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం వాల్తేర్ వీరయ్య. ఈ సినిమా థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బాలకృష్ణ సినిమాకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఇక చిరంజీవి నటించిన సినిమాలు ఆచార్య ప్లాప్ గా నిలిచింది. దీంతో చిరంజీవి గ్రాఫ్ పడిపోయిందని వార్తలు వినిపించాయి. ఇక తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు చిరంజీవి.

వాల్తేరు వీరయ్య చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించగ.. విలన్ గా బాబి సింహ నటించారు. ఇక శృతిహాసన్ కూడా ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకుంది. ఇక దీంత బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు ఎట్టకేలకు ఈనెల 27వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవడం జరిగింది. దీంతో ఈ సినిమా ఓటీటి లో విడుదలయ్య ప్రశంసలు అందుకుంటుంది ముఖ్యంగా ఈ సినిమా బిజిఎం కూడా దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా అందించారని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో విడుదలైన చిరంజీవి చిత్రాలకంటే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి కూడా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది. మరి ఈ సినిమాను కూడా ఏడాది విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు చిరంజీవి సినిమా ఓటీటి లో సక్సెస్ అయ్యిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: