పవన్ కళ్యాణ్ "ఓజి" షూటింగ్ స్టార్ ఆ నెల నుండే..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే ఓజి అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ఫైట్ లు మరియు పాటలు ఉండబోయే అవకాశం లేనట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలాగే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు ... ఈ 30 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని ముగించే విధంగా ఇప్పటికే చిత్ర బృందం పవన్ కళ్యాణ్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే కొన్ని రోజులు అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

లాగే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసే విధంగా ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే సుజీత్ ఇప్పటికే రన్ రాజా రన్ ... సాహో మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లలో రన్ రాజా రన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ... సాహో సినిమా సౌత్ లో పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ నార్త్ లో మాత్రం అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ కలెక్షన్ ల పరంగా తక్కువ కలెక్షన్ లనే నమోదు చేసినప్పటికీ సుజిత్ కు మాత్రం దర్శకుడిగా ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: