ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే మూవీbలో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన  క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో రుపొందబోయే ఒక సినిమా లోను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే మరో సినిమా లోను హీరోగా నటించబోతున్నట్లు ప్రకటించాడు.

ఎన్టీఆర్ ... కొరటాల శివ తో నటించబోయే సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొంది నుండగా ... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే సినిమా 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలుబడ్డాయి. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయినా కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ ... కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల ఇప్పటికే చాలా రోజులు అవుతున్న వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా ఇప్పటికీ కూడా సెట్స్ పైకి వెళ్లలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల నుండి ఎన్టీఆర్ ... కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఇలా ఎన్టీఆర్ ... కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిపోయే సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అవుతూ ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కంటే ముందే ఎన్టీఆర్ ... ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా థియేటర్ లలో విడుదల కాబోతుంది అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ వార్తలు ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: