గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు..!!

Divya
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గా సుదీర్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న రైటర్ కం డైరెక్టర్ హర్షవర్ధన్ కాంబినేషన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే మామ మచ్చింద్ర అనే టైటిల్ని ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.
కానీ తాజాగా నిన్న వచ్చిన అప్డేట్ ప్రకారం ఇందులో మూడు పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూడు పాత్రలు చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దుర్గ డీజే పరశురాం పాత్రలలో ఈయన కనిపించబోతున్నట్లు సమాచారం. దుర్గ అనే బరువైన పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది.. ది వెయిట్.. ఇస్ ఓవర్ దుర్గ అనే బరువైన పాత్రలో మి దిల్ దోచేయడానికి వస్తున్నాడంటూ క్యాప్షన్ తో ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. ఇక పరశురాం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ నాలుగవ తేదీన డీజే పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ఏడవ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

దుర్గా పాత్రలో సుధీర్ బాబు చాలా లావుగా కనిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు లడ్డు బాబు సినిమా కోసం ఎలా అయితే అల్లరి నరేష్ లావుగా కనిపించారు ఇప్పుడు సుధీర్ బాబు కూడా అలాగే కనిపించబోతున్నారు. దుర్గా పాటల కోసమే ఇలా డిజైన్ చేసినట్లుగా సమాచారం. సుధీర్ బాబు ఇప్పటికే జాకిశ్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన  చిత్రంలో కూడా విలన్ గా నటించారు. సుధీర్ బాబు కెరియర్ లో 15వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం మూడు ఛాలెంజింగ్ పాత్రలలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: