టాలెంటెడ్ డైరెక్టర్ తో నిఖిల్..!

shami
2022 యువ హీరో నిఖిల్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అతను చేసిన రెండు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా కార్తికేయ 2 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు నిఖిల్. ఇక ఆ సినిమా తర్వా వచ్చిన 18 పేజెస్ సినిమాతో కూడా నిఖిల్ తన టాలెంట్ చూపించాడు. సుకుమార్ కథ అందించిన 18 పేజెస్ సినిమా నిఖిల్ కు మరో హిట్ అందించింది. లవ్ స్టోరీగా వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. కార్తికేయ జోడీ అవడం వల్ల సినిమా మరింత ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత స్పై సినిమా చేస్తున్నాడు నిఖిల్.
దానితో పాటుగా కార్తికేయ 3 వర్క్ కూడా నడిపిస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో కార్తికేయ 3 ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలై నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఇదిలాఉంటే నిఖిల్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ థర్డ్ సినిమా నాని అంటే సుందరానికీతో నిరాశపరిచాడు. అంటే సుందరానికీ సినిమా కూడా బాగానే ఉన్నా అందరికి అది నచ్చలేదు.
కమర్షియల్ గా ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. అయితే నానితోనే మరో సినిమా ప్లానింగ్ లో ఉండగా ఈసారి నిఖిల్ తో వివేక్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. నిఖిల్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ అదిరిపోతుంది. ఆల్రెడీ రెండు హిట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి నిఖిల్ కూడా వివేక్ మీద హోప్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి హీరో, డైరెక్టర్ ఇద్దరు సూపర్ టాలెంటెడ్ కాగా ఈ ఇద్దరు కలిసి ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమా అందిస్తారని ఆశించవచ్చు. వివేక్ ఆత్రేయ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయగా సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: