వాళ్లకి నిద్రపట్టకుండా చేస్తున్న శ్రీలీల..!

shami
కన్నడ భామ శ్రీలీల టాలీవుడ్ కి అడుగు పెట్టిన ముహుర్తం గుడ్ టైం అనుకుంటా అందుకే అమ్మడికి వరుస లక్కీ ఛాన్స్ లు వస్తున్నాయి. మొదటి సినిమా శ్రీకాంత్ తనయుడు రోషన్ తో చేస్తే ఆ సినిమాలో అమ్మడి చలాకీతనానికి రవితేజ ధమాకా ఛాన్స్ రావడం ఏంటో.. ఇక వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని అమ్మడు అదరగొట్టేయగా ఆ దెబ్బతో ఆ సినిమా హిట్ అవడమే కాదు వరుస క్రేజీ ఛాన్స్ లు రావడం ఏంటో అంతా మాయగా ఉంది. అసలు శ్రీలీల కూడా ఊహించని విధంగా అమ్మడి ఆఫర్లు వరిస్తున్నాయి. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్న శ్రీలీల పవన్ సాయి ధరం తేజ్ సినిమాలో ఉందన్న వార్తలు వచ్చాయి.
అయితే పవన్, తేజ్ సినిమాల ఫుల్ కాస్ట్ డీటైల్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించగా అందులో శ్రీలీల పేరు లేదు. అయినా సరే శ్రీలీల మహేష్ 28వ సినిమాలో ఒక హీరోయిన్ గా చేస్తుంది. రవితేజ తర్వాత వెంటనే సూపర్ స్టార్ ఛాన్స్ అంటే అది మాములు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే మహేష్ తో మూవీతో అమ్మడు నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని చెప్పొచ్చు. త్రివిక్రం డైరెక్షన్ లో మహేష్ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఛాన్స్ అందుకోవడం ఆమె సహ నటులకు, కో యాక్ట్రెస్ లకు షాక్ ఇస్తుంది.
రెండు సినిమాలకే మహేష్, పవన్ సినిమాల్లో నటించే రేంజ్ కి శ్రీలీల వెళ్లడం అమ్మడిని చూసి మిగతా హీరోయిన్స్ అంతా కుళ్లుకుంటున్నారు. ఓ విధంగా టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరతకి కరెక్ట్ టైం లో శ్రీలీల ఎంట్రీ జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికీ సినిమా సినిమాకొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నా కొందరు మాత్రమే స్టార్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వారిలో శ్రీలీల మాత్రం కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. మహేష్ సినిమా తర్వాత అమ్మడిని పట్టుకోవడం కూడా కష్టమని ఫిల్మ్ నగర్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: