పవన్ సినిమాకు బాలయ్య సినిమా స్పూర్తి !

Seetha Sailaja

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో లేటెస్ట్ గా మొదలైన ‘వినోదయసితం’ రీమేక్ కు సంబంధించి వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి స్క్రీన్ ప్లే సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తూ ఉండటంతో ఈమూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈమధ్యనే షూటింగ్ మొదలైన ఈమూవీని చాలవేగంగా పూర్తిచేసి ఈసమ్మర్ రేస్ చివరిలో విడుదలచేయాలి అన్నపట్టుదలలో అటు పవన్ ఇటు త్రివిక్రమ్ కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు లీక్ అవుతున్నాయి. ఈమూవీలో పవన్ దేవుడు గా నటిస్తూ ఉంటే తేజుకి హీరోయిన్ గా కేతిక శర్మ అతని చెల్లి క్యారెక్టర్ కి ప్రియా వారియర్ నటిస్తున్నారు.

ఈమూవీకి మరింత క్రేజ్ ను తీసుకురావడానికి ప్రస్తుత తరం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న శ్రీలీల తో ఒక ఐటమ్ సాంగ్ ను క్రియేట్ చేసి ఆసాంగ్ లో పవన్ సాయి ధరమ్ లతో స్టెప్స్ వేయిస్తారని లీకులు వస్తున్నాయి. ఈసినిమాలో దేవుడు పాత్రలో కనిపించబోతున్న పవన్ చెప్పే డైలాగ్ లు అతడి భావజాలానికి పరోక్షంగా జనసేన కు ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి అన్నీ ఒక ఎత్తేయితే ఈమూవీ టైటిల్ కు పరోక్షంగా బాలకృష్ణ స్ఫూర్తి ఉంటుంది అంటూ ఒక ప్రచారం మొదలైంది. హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకి ‘దేవుడు’ అన్న టైటిల్ ను త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు టాక్. 1997లో బాలకృష్ణ హీరోగా ‘దేవుడు’ అన్న మూవీ వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోవడంతో అప్పట్లో ఈసినిమా ఫెయిల్ అయింది. ఈ సినిమాలో బాలయ్య వెంకటేష్ నటించిన ‘చంటి’ మూవీ తరహాలో అమాయకంగా నటించి మెప్పించినా ఆసినిమా ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు ఈ ‘దేవుడు’ ప్రయోగం ఏమవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: