ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తే ఊరుకునేదే లేదు : కస్తూరి

murali krishna
హీరో హీరోయిన్ లపై ట్రోల్స్ ఈ మధ్య బాగా ఎక్కువవుతున్నాయి. ఏ చిన్న తప్పు చేసిన కూడా వెంటనే ట్రోల్స్ తో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంటారు కొందరు నెటిజన్లు.
ఈ క్రమంలోనే కొంతమంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేశారటా.. అలంటి వారి పై నటి కస్తూరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన కస్తూరి ఇప్పుడు టీవీ సీరియల్స్‌లో అయితే నటిస్తోంది. ఆమె నటిస్తోన్న గృహలక్ష్మీ సీరియల్ కు మంచి క్రేజ్ కూడా ఉంది. ఇక ఈ భామ సమాజంలో జరిగే విషయాలపై గట్టిగానే స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొందటా.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఆమె ఘాటుగా స్పందించింది.
ఈ క్రమంలో మంచు లక్ష్మీ పై వస్తోన్న ట్రోల్స్ ను ఆమె సమర్ధించింది. తెలుగుని తెలుగులా మాట్లాడాలని అలా మాట్లాడితేనే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆమె మాట్లాడింది. ఇటీవల ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.. అమెరికన్ యాక్సెంట్ లో అయితే మాట్లాడారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడటం పై పలువురు ట్రోల్స్ కూడా చేశారు.
దీని పై కస్తూరి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈవెంట్ లో అమెరికన్ ఇంగ్లీష్ యాసలో మాట్లాడితేనే అక్కడి వారికి బాగా అర్థమవుతుందని చెప్పుకొచ్చిందటా.కస్తూరి. అలాగే ఎన్టీఆర్ అద్భుతంగా మాట్లాడాడు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ ఏ భాషను అయిన కొద్దీ నెలలలోనే నేర్చుకొని ఎంతో ప్రొఫెషనల్ గా మాట్లాడతాడు. ఆయనకు వున్న అంత ప్రతిభ ఉంది. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని. నా అభిమాన హీరోని ట్రోల్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ చెప్పుకొచ్చిందట కస్తూరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: