నాటు నాటు క్రెడిట్ హీరోలది కాదు: రాజమౌళి

Purushottham Vinay
ఇంటర్నేషనల్ లెవెల్ లో రోజుకో అవార్డుని దక్కించుకుంటూ ఆస్కార్ అవార్డ్స్ కి 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' క్యాటగిరీలో 'నాటు నాటు' సాంగ్ ద్వారా నామినేట్ అయ్యింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. మరి ప్రపంచవ్యాప్తంగా పాపు్లారిటీని పొందిన ఆస్కార్ అవార్డుని కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా దక్కించుకుంటుందా లేదా అనేది ఇక మార్చి 12 వ తేదీన తెలియబోతుంది.ఈ పాటకి ఆస్కార్ అవార్డు అందుకునేందుకు చాలా విధాలుగా అర్హత ఉంది.ఈ సాంగ్ కేవలం ఇండియా ని మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తాన్ని కూడా షేక్ చేసి ఒక ఊపు ఊపేసింది.అసలు తెలుగు బాషా రాని వాళ్ళు కూడా ఈ పాట కి అందులోని సిగ్నేచర్ స్టెప్పులేస్తూ ఇంస్టాగ్రామ్ లో తెగ రీల్స్ పెట్టేసి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అసలు ఒక తెలుగు పాట కి ప్రపంచం మొత్తం ఈ రకంగా ఊగిపోవడం అనేది ఇది వరకు ఎప్పుడూ జరగలేదు.ఈ సాంగ్ కి ఈ రేంజ్ రావడానికి కారణం ఖచ్చితంగా ఈ సినిమా హీరోలే.


వాళ్ళు ఆ రేంజ్ లో పోటీ పడి డాన్స్ చెయ్యకపొయ్యుంటే ఈ సాంగ్ కి ఇంత రీచ్ వచ్చేది కాదని చెప్పడం లో అసలు ఎలాంటి అతిశయోక్తి లేదు.కానీ జక్కన్న రాజమౌళి దృష్టిలో మాత్రం ఈ సాంగ్ క్రెడిట్ అనేది హీరోలకు దక్కదట.. 'నేడు 'నాటు నాటు' పాట కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలుగచేస్తుందని రాజమౌళి అన్నాడు.ఈ పాట ఈ రేంజ్ కి రావడానికి కారణం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని చెప్పాడు..ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ వల్లే ఈ రోజు ఆ పాటకి ఇంతగొప్ప రెస్పాన్స్ వచ్చింది..హీరోలు ఆ స్టెప్పులను తూచా తప్పకుండా వేసి పాటని మరోలెవెల్ కి తీసుకెళ్లారు అని అన్నాడు.ఆస్కార్ నామినేషన్స్ దక్కడం మా అదృష్టం, కచ్చితంగా మేము ఆ అవార్డుని గెలుచుకుంటామని చాలా బలంగా నమ్ముతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.మరి మార్చ్ 12 వ తేదీన లాస్ ఏంజిల్స్ లో జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ లో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కుతుందా లేదా అని అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: