శంకర్ ని కూడా కొనేసిన మైత్రి?

Purushottham Vinay
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలంతా కూడా ఆయన కోసం క్యూ కడతారు. అలాంటి లెజెండరీ దర్శకుడితో టాలీవుడ్ సినిమా స్టార్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మూవీ చెయ్యడానికి భారీగా సమర్పించుకునేందుకు రెడీ అయ్యింది.శంకర్ ఒక్కసారి రెడీ అంటే చాలు ఏకంగా వందల కోట్లు పెట్టి మరీ సినిమాని నిర్మించడానికి రెడీగా ఉన్నట్లు మైత్రి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే మైత్రీ శంకర్ ని ఇప్పుడు కాదు..చరణ్ సినిమా లాక్ అయిన వెంటనే ఆయనకు టచ్ లోకి వెళ్లినట్లు ఇప్పుడు సమాచారం తెలుస్తుంది.అంతేకాదు ఈ టాప్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఏకంగా 50 కోట్ల రూపాయాలు అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. ఈ వ్యవహారాన్ని అంతా కూడా మధ్యలో ఉండి నడిపింది నిర్మాత దిల్ రాజు అని సమాచారం తెలుస్తుంది. శంకర్ కి కోలీవుడ్ బ్యానర్లలో కమిట్ మెంట్లు ఉన్నా కానీ దిల్ రాజు సహా రామ్ చరణ్ మాట సాయం చేయడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన అడ్వాన్స్ ని శంకర్ తిరస్కరించలేకపోయినట్లు సమాచారం వినిపిస్తుంది.


అయితే తమ సంస్థలో సినిమా చేయాలంటే మూడేళ్లు ఆగాలని శంకర్ వారికి కండీషన్ పెట్టారట.అందుకు ఒకే అయితే ఆఫర్ చేసిన అడ్వాన్స్ తీసుకుం టానని చెప్పడం దానికి మైత్రీ కూడా అంగీకరించడంతో ఈ డీల్ కుదిరినట్లు సమాచారం తెలుస్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్ 2026 వ సంవత్సరంలో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తోంది. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి తమ బ్రాండ్ ని చాటిందని చెప్పొచ్చు. మైత్రీ సంస్థ టాలీవుడ్ లో లాంచ్ అయిన నాటి నుంచి స్టార్ హీరోలే టార్గెట్ గా పెట్టుకొని వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెలు అందుకుంటూ స్పీడ్ గా దూసుకుపోతుంది. ఇప్పటి దాకా అపజయమెరుగని సంస్థగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ పేరొందింది. ఇప్పుడు ఏకంగా దేశం గర్వించదగ్గ దర్శకుడితోనే సినిమాకి రంగం రెడీ చేస్తుంది. ఇప్పటికే 'పుష్ప' సినిమాతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియాలో వెలిగిపోతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: