ఇన్నాళ్ళకి బయటపడ్డ నిజం.. సమంత నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం ఇదే..!?

Anilkumar
సౌత్ సినీ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య మరియు సమంత కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగ కనిపించే ఈ జంట విడాకులు తీసుకోవడంతో అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. వీరిద్దరూ విడాకులు తీసుకుని దాదాపు ఏడాది దాటిపోయింది. విడాకులు అనంతరం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సమంత ఒకవైపు సినిమాలో చేస్తూనే తనకి వచ్చిన మయోసైటిస్ అనే వ్యాధికి సంబంధించిన చికిత్సను కూడా తీసుకుంటుంది. మరోవైపు నాగచైతన్య కూడా వరుస సినిమాలో చేస్తున్నాడు. అంతేకాదు త్వరలోనే హీరోయిన్ శోభిత ధూళిపాలని రెండు వివాహం

 చేసుకుంటున్నాడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే ..వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. వీరిద్దరి విడాకులకే సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వచ్చినప్పటికీ వాటిలో ఒక్క నిజం కూడా లేదు .అయితే ఇన్నాళ్టికి వారిద్దరూ విడిపోవడానికి గల ముఖ్య కారణం బయటకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందు నుండి సమంత వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయ్యే అమ్మాయి.. సమంత ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.. సాధారణంగా సమంత షూటింగ్ లేని సమయంలో ఇతర దేశాలకి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది.. చాలాసార్లు నాగచైతన్య ని వదిలేసి ఒంటరిగా

 కూడా వెళ్లిన సందర్భాలు కూడా  ఉన్నాయి.. కానీ నాగచైతన్య మాత్రం సమంతకి పూర్తిగా భిన్నంగా ఉండేవాడు.. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు.. సినిమాలు లేని సమయంలో ఇంట్లో వంటలు చేయడం పుస్తకాలు చదవడం వంటి వాటిని బాగా ఇష్టపడతారు.. అయితే ఈ విషయంలో వీరిద్దరికీ ఎప్పుడు తరచూ గొడవలు వస్తూ ఉండేవట.. అంతేకాదు సమంత బోల్డ్ సన్నివేశాలలో నటించడం నాగచైతన్యకి ఏమాత్రం ఇష్టం లేదు.. ముఖ్యంగా చెప్పాలి అంటే సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించడం నాగచైతన్య కి ఏమాత్రం ఇష్టం లేదు.. ఇక ఈ సిరీస్ తర్వాతే సమంతకి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి.. రిజెక్ట్ చేయమని నాగచైతన్య ఎంత చెప్పినా సమంతా ఒప్పుకోలేదు.. దీంతో వీరిద్దరి మధ్య అప్పట్లో పెద్ద గొడవలు జరిగాయి.. అలా చిన్న చిన్నవి కాస్త పెద్దగా మరి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: