ఎన్టీఆర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన చరణ్...!!

murali krishna
సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన  రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య కూడా అలాంటి స్నేహబంధం ఉంది అయితే ఈ ఇద్దరు కలిసి నటించిన rrr సినిమా తర్వాత వీరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మరింత బలపడిందనీ చెప్పవచ్చు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి సందడి చేశారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇక ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు అలాగే పురస్కారాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా ఐదింటినీ తన ఖాతాలో వేసుకుందటా..అదే సమయంలో బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో నామినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఎన్టీఆర్ పై తనకు ఉన్నటువంటి ప్రేమను మరోసారి బయటపెట్టారటా.. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ..బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా నా అన్న ఎన్టీఆర్ పేరుతో పాటుగా నా పేరును కూడా చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక మా పేర్లు హాలీవుడ్ దిగ్గజాలు అయిన నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లతో కలిసి ఉండటం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ రామ్ చరణ్  ఎన్టీఆర్ ను అన్న అంటూ సంబోధించడంతో వీరి మధ్య ఉన్నటువంటి అనుబంధం మరోసారి బయటపడిందని చెప్పొచ్చు.ఇలా ఎన్టీఆర్ పై వున్నా ప్రేమను బయట పెట్టాడు చరణ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: