ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్న మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలా ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.
వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
వీర సింహా రెడ్డి : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
వారసుడు : దళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ డబ్బింగ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసి హిట్ స్టేటస్ ను అందుకుంది.
రైటర్ పద్మభూషణ్ : సుహాస్ హీరో గా రూపొందిన ఈ సినిమా మంచి కలెక్షన్ లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్మల ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది.
సార్ : ధనుష్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంది.
వినరో భాగ్యము విష్ణు కథ : కిరణ్ అబ్బవరం హీరోగా కాశ్మీరీ పరదేశి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: