విజయ్ దర్శకుడితో రజనీకాంత్ సినిమా..?

Pulgam Srinivas
ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మా నగరం మూవీ తో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న ఈ యువ దర్శకుడు ఆ తర్వాత ఖైదీ ... మాస్టర్ మూవీ లతో తన క్రేజ్ ను మరింత గా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ దర్శకుడు లోక నాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో విజయ్ సేతుపతి ... ఫాహాధ్ ఫజిల్ ... సూర్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ విజయం తో లోకేష్ కనకరాజు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు తలపతి విజయ్ హీరో గా రూపొందుతున్న లియో అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఈ మూవీ సెట్స్ పై ఉండగానే సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ఒక మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజినీ కాంత్ కెరియర్ లో 171 వ మూవీ గా రూపొందబోయే సినిమాను లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీ కాంత్ ... నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రమ్య కృష్ణ ... తమన్నా ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే లోకేష్ కనకరాజు కత్తి 2 మరియు విక్రమ్ 2 మూవీ లను కూడా తెరకెక్కించడానికి రెడీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: