మహేష్ 28వ మూవీలో సూపర్ క్రేజ్ ఉన్న నటులు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్ లో 28 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా  పూజా హెగ్డే ... శ్రీ లీల ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఆడిపడనున్నారు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యే కొంత కాలం అవుతుంది. కొంత కాలం క్రితమే ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో అదిరిపోయే క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో నాజర్ ... కోట ... బొమ్మన్ ఇరానీ ... సచిన్ ఖేడ్కర్ ... ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులు నటించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దబోతున్నట్లు ... ఈ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో మిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వరస విజయాల తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడం ... అలా వైకుంటపురంలో లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: