జగపతి బాబు తండ్రి రాజేంద్రప్రసాద్ 'దసరా బుల్లోడు ' సినిమా తీయడానికి కారణం.....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు కెరియర్ ను నిలబెట్టిన వారిలో దుక్కిపాటి మధుసూదన్ రావు మరియు గూడవల్లి రామబ్రహ్మం లాంటివారు మొదటి వరసలో ఉంటారు. దుక్కిపాటి వారినైతే అక్కినేని గారు తన గురువుగా భావిస్తారు టాలీవుడ్ లో దిగ్గజ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఎదగడానికి ఈ దర్శక నిర్మాతలుఒక కారణం కావడం విశేషం ఐతే వీరి తర్వాత అదే స్థాయిలో అక్కినేనికి విజయాలను అందించిన వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ గారికి స్థానం దక్కుతుంది.
జగపతి ఆర్ట్ పిక్చర్స్ అనే బ్యానర్ను స్థాపించి రాజేంద్రప్రసాద్ నిర్మాతగా అక్కినేని వారితో పలు సూపర్ హిట్ మూవీస్లను నిర్మించారు.
ఐతే రాజేంద్ర ప్రసాద్ గారికి అక్కినేని వారికి మంచి స్నేహం ఉండేది. ఈ క్రమంలో అక్కినేని మరియు వాణిశ్రీ హీరో హీరోయిన్స్ గా దసరా బుల్లోడు సినిమా తీయాలని రాజేద్రప్రసాద్ గారు తలపెట్టారు. కానీ ఆ సినిమా కోసం అనుకున్న దర్శకుడు ఇంకొక సినిమాతో బిజీగా ఉండటం తో అక్కినేని నాగేశ్వరరావు రాజేంద్ర ప్రసాద్ నీ డైరెక్షన్ వహించమని కోరారు. ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేయకపోతే తాను ఆ మూవీలో చేయను అంటూ షరతు పెట్టారు.
ఆ విధంగా అక్కినేని బలవతం తో దసరా బుల్లోడు దర్శక నిర్మాత గా మారి పని చేయడం తో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఆ విధంగా వీరి బంధం కూడా బాగా బలపడింది.ఐతే అక్కినేని మరియు రాజేంద్ర ప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరిగిందట.రాజేంద్ర ప్రసాద్ దసరా బుల్లోడు సినిమా టైంలో ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉండేవారట. ఆ విషయం కొంత మంది మిత్రులతో కూర్చున్న టైం లో అక్కినేని అందరితో చెప్పారట. ఐతే ఈ సంగతి ఆ నోట ఈ నోట రాజేంద్ర ప్రసాద్ వరకు చేరింది. మంచి మిత్రుడు అనుకున్న వ్యక్తి ఇలా చేయడంతో కోపంతో ఊగిపోయిన రాజేంద్ర ప్రసాద్ నేరుగా అక్కినేని దగ్గరికి వెళ్లి నిలదీసారట. నా విషయాలు అందరిలో చెప్పాల్సిన అవసరం నీకు ఏం వచ్చింది అంటే అక్కినేనికి సైలెన్స్ యే సమాధానం అయ్యిందట. ఆ విధంగా అప్పుడు అక్కినేని కి రాజేంద్ర ప్రసాద్ కి మధ్య పెద్ద గొడవ జరిగిందట. ఐతే ఇప్పటి వారికీ తెలియని సంగతి ఏంటంటే ఈ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మరెవరో కాదు జగపతి బాబు గారి నాన్న గారు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: