"ఎన్బికె 108" నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం ఆ తేదీ నుండే..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకొని వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు.

మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో హనీ రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ... దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీbలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ మార్చి 4 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: