కోవిడ్ టైం లో తాను పొందిన వింత అనుభవం గూర్చి చెప్పిన ఆ డైరెక్టర్....!!

murali krishna
మాములుగా  సెలబ్రిటీలు ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు తెగ ఎగబడుతూ ఉంటారు. ఐతే అలాంటిది వారి ఫోన్ నెంబర్స్ దొరికాయి అంటే సెలబ్రిటీలకు ఇంకా చుక్కలే అని చెప్పవచ్చు.
ఐతే వారికీ సంబంధించిన నెంబర్లు సేవ్ చేసుకోవడం వాట్సాప్ లో, నార్మల్ కాల్స్ చేయడం వీడియో కాల్ చేయడం లాంటివి చేస్తూ విసిగిస్తూ ఉంటారు. అయితే అలాంటి కేసెస్ లో ఒకటి ఐనా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క నెంబర్ దొరకడంతో ఇలాంటి పనే చేశారు కొందరు వ్యక్తులు. అసలేం జరిగిందంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ విషయం గురించి స్పందిస్తూ తనకు ఎదురైనా ఒక భయంకరమైన సంఘటన గురించి తెలిపారు.
ఆయనకు కోవిడ్ టైం లో  ఒక వింత అనుభవం ఎదురయింది. కోవిడ్ టైం లో నా స్నేహితుడు తండ్రికి సీరియస్ అయ్యింది. ఒక బ్లడ్ గ్రూప్ కావాలి దానికోసం వెతుకుతూ ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకొని ఆ నెంబర్ తో ఒక పోస్ట్ పెట్టాను. ఎవరైనా రక్తం దానం చేసేవారు ఉంటే ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ని హీరోయిన్ అనుష్క సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. చాలామంది నెటిజన్స్ అభిమానులు అది అనుష్క నెంబర్ అనుకొని కాల్స్ చేయడం మెసేజ్ చేయడం వీడియో కాల్స్ చేయడం లాంటివి చేశారు. ఐతే కొందరు అబ్బాయిలు షర్టు లేకుండా ఉన్న ఫోటోలు కూడా పంపించారు. వాటిని చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఇంత దారుణంగా ఉంటారా. అక్కడ పెట్టిన పోస్ట్ ఏమిటి జనాలు చేస్తున్న పని ఏమిటి. హీరోయిన్లకు నిజంగా ఇంత నరకం ఉంటుందా అనేది నాకు అపుడు అర్ధం ఇంది. పొరపాటున వారి నెంబర్ బయటకు వెళ్తే ఇంత దారుణంగా ఉంటారా అంటూ తనకు ఎదురైన ఆ సంఘటన గురించి చెబుతూ అసహనం వ్యక్తం చేశారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. తన స్నేహితుడు తండ్రికి రక్తదాతలు దొరికిన తర్వాత ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఐతే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో,బ్రోచేవారెవరు,అంటే సుందరానికి వంటి సినిమాలను తీసి దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
ఈ విధంగా ఆయన పొందిన అనుభవాన్ని ఒక ముఖముఖి సంభాషణలో చెప్పుకోచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: