ఆ తేదీన ఆ మూడు క్రేజీ సినిమాల విడుదల..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలో ఒకే రోజు థియేటర్ లలో విడుదల అవుతూ ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మూడు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ మూడు మూవీ లు ఏవో వాటి గురించి తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి మూవీ లో హీరో గా నటిస్తున్న మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో రమ్యకృష్ణ ... తమన్నా ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు.
రన్బీర్ కపూర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న అనిమల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇలా అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ మూడు మూ వీలను కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూడు మూవీ యూనిట్ లు ఇప్పటికే ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: