"సలార్" మూవీలో శృతిహాసన్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సీనియర్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వాల్టేరు వీరయ్య ... వీర సింహా రెడ్డి మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లలో వాల్తేరు వీరయ్య మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... వీర సింహా రెడ్డి మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ రెండు మూవీ లు కూడా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఒక రోజు తేడాతో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ మూవీ ల ద్వారా శృతి హాసన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింతగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కే జి ఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే ఈ మూవీ లో శ్రుతి ... ఆధ్య అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది.
 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని శృతి పాత్రకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో శృతి పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: