'అమ్ములు 'అని ముద్దు పేరుతో పిలిచే ఆ స్టార్ హీరోయిన్.....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో హీరోయిన్ గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అదే ఏడాది మరో అవకాశాన్ని కూడా అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్ళల్లో పడటంతో 2021 లో పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా మాత్రం మరింత క్రేజీ సంపాదించింది. మరోసారి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. దీంతో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు. అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది. ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు. ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం కుర్రాళ్ళ మదిలో క్రష్ గా ఈ బ్యూటీనే ఉంది. ఇక పొట్టి పొట్టి బట్టలు కూడా వేస్తూ బాగా సెగ పుట్టిస్తుంది. అలా సోషల్ మీడియా లో ఈమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తనకు ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా తనకు ఖాళీ సమయం దొరకటంతో తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్పింది. ఇక తన చిన్ననాటి ఫోటోలు కూడా పంచుకుంది. అయితే ఓ అభిమాని.. మీ ముద్దు పేరు ఏంటి అని అడగటంతో.. వెంటనే ఏమాత్రం మొహమాటం పడకుండా అమ్ములు అని చెప్పేసింది. దీంతో తన ఫాన్స్ మొత్తం తనను అమ్ములు అని పిలుస్తూ ఉన్నారు. తనని ఇంట్లో వాళ్లంతా ముద్దుగా అమ్ములు అని పిలుస్తారు అని అర్థమవుతుంది. చూడ్డానికి పేరుకు తగ్గట్టుగానే ఉంది శ్రీలీలా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: