త్రివిక్రమ్: పూజా కోసం స్పెషల్ కార్, సకల సౌకర్యాలు?

Purushottham Vinay
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఒకే హీరోయిన్ తో వరుస పెట్టి సినిమాలు చేస్తుంటారు. గతంలో సమంత అయితే ఇప్పుడు పూజా హెగ్డే. గురూజీకి పూజా హెగ్డే అంటే చాలా స్పెషల్. ప్లాప్స్ లో ఉన్నప్పుడు ఆమెకు గట్టి బ్రేక్ ఇచ్చాడు. వరుసగా తన మూడో సినిమాకు ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.SSMB28లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది సూపర్ స్టార్ మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా. మహేష్ సినిమా కావడంతో ఈ సినిమాని మేకర్స్ అసలు కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఒక ఇంటి సెట్ కోసం ఏకంగా మేకర్స్ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేశారట. ఈ సినిమా హౌస్ సెట్స్లో కీలక సన్నివేశాలని కూడా తెరకెక్కించనున్నారట. అయితే పూజా హెగ్డే కోసం ఏకంగా నిర్మాతలతో ఒక లగ్జరీ కారు కూడా కొనిపించారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆమె ఏకంగా ఎయిర్ పోర్ట్ నుండి హోటల్ కి హోటల్ నుండి సెట్స్ కి రావడానికి ఆ కార్ నే వాడతారట. ఇంకా ఈ సినిమా షూటింగ్ కోసం కూడా ఆ కార్ అవసరం ఉందట.


అద్దెకు తీసుకోవడం కంటే కొనడమే చా బెటరని త్రివిక్రమ్ నిర్మాతలను ఒప్పించారట. టాలీవుడ్ లో ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. పూజా హెగ్డేను త్రివిక్రమ్ అసలు కాలు క్రింద పెట్టనీయడం లేదని ఇంకా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజా హెగ్డేలకు ఎస్ఎస్ఎంబి 28 వరుసగా హ్యాట్రిక్ మూవీ. ఇంకా అలాగే సూపర్ స్టార్ మహేష్ తో కూడా ఆయనకు ఇది హ్యాట్రిక్ చిత్రం. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన అయితే జరగలేదు. ఇందులో ఓ పోలీస్ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ అయిన భూమి పెడ్నేకర్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ సినిమాని విడుదల చేయనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: