'అఖండ' వంటి డివోషనల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నుండి వచ్చిన సినిమా 'వీరసింహారెడ్డి'. అఖండ పెద్ద హిట్ కావడం వల్ల ఈ మూవీ పై మొదటి నుండి అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. అందుకే ఈ సినిమా ఓపెనింగ్స్ బాలయ్య అభిమానులు కలలో కూడా ఊహించని విధంగా 50 కోట్ల రూపాయలకు పైగా భారీ వసూళ్లను రాబట్టింది.కానీ ఫుల్ రన్ లో మాత్రం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా వసూళ్లకు దరిదాపుల్లోకి రాలేకపోయినా పండగ సెలవుల్లో బాగా ఆడి ఫైనల్ గా హిట్టుగా నిలిచింది. ఈ సుమారుగా 75 కోట్ల పైగా షేర్ ఇంకా 130 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చెయ్యగా ఇంకా పెద్ద హిట్టు అవ్వడమే కాకుండా ఎన్నో రికార్డులని నమోదు చేస్తుంది. డిస్నీ + హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.'అఖండ' సినిమాకి రికార్డు స్థాయి వ్యూస్ రావడం తో 'వీర సింహా రెడ్డి' డిజిటల్ రైట్స్ ని పోటీపడి మరీ దక్కించుకుంది డిస్నీ+ హాట్ స్టార్.
ఇక గత కొద్దీ రోజుల నుండి ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో చేసారు.బాలయ్య బాబు చేత ఈ సినిమా హాట్ స్టార్ లో చూడండి అంటూ ఒక ప్రత్యేకమైన వీడియో ని కూడా షూట్ చేశారు.అలా భారీ హైప్ తో ఓటీటీ లో విడుదలైన 'వీర సింహా రెడ్డి' కి విడుదల అయిన కొన్ని గంటలకే అరుదైన రికార్డ్స్ వచ్చాయట.ఈ సినిమాని అప్లోడ్ చేసిన గంటలోనే రెండు మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట.ఇక ఇది తెలుగు సినిమాలలో ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం వరుస హిట్లతో తన పూర్వ వైభవాన్ని దక్కించుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావి పూడి దర్శకత్వంలో తన 108 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పై కన్నేసాడు బాలయ్య. ప్రస్తుతం తన అన్న కొడుకు ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న చనిపోయిన బాధలో వున్నాడు బాలయ్య. అందువల్ల తన 108 వ సినిమాని వాయిదా వేసుకున్నాడు.