హాలీవుడ్ మూవీస్ చెయ్యాలనుంది: రామ్ చరణ్

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే స్థాయిలో వున్నాడనే చెప్పాలి. గత మూడు రోజులుగా అమెరికా పర్యటనలో రామ్ చరణ్ బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ పేరు ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చరణ్ కి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రముఖ ఛానల్ అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలో ప్రసారమ్యే గుడ్ మార్నింగ్ అమెరికా షోకు అతిథిగా వెళ్లడం జరిగింది.ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే తనకు హాలీవుడ్ లు చేయాలని ఉందంటూ కూడా తన మనసులోని కోరికను బయటపెట్టారు.ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ సక్సెస్ అని అనిపిస్తుందా అని అడగ్గా..అందుకు రామ్ చరణ్ స్పందిస్తూ.. ఆర్ ఆర్ ఆర్ కోసం తాము చాలా కష్టపడ్డామని అన్నారు. 


అలాగే నాటు నాటు పాటను ఉక్రెయిన్ లోని అందమైన లొకేషన్లలో షూట్ చేశామని.. షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఒక టూరిస్ట్ గా మళ్లీ ఉక్రెయిన్ కు వెళ్లాలని అనుకున్నానని చరణ్ తెలిపారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తే ఒక ఇండియన్ గా చాలా గర్వపడతానని చెప్పారు. ఆస్కార్ అవార్డుల స్థాయికి భారతీయ చిత్రాలు వస్తుండటం చాలా సంతోషకరమని అన్నారు. సినిమాకి బాష ఉండదని కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయని చరణ్ అన్నారు.కోవిడ్ టైములో భారతీయ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా చూశారని అన్నారు. కేవలం భారతీయ సినిమాలు మాత్రమే కాకుండా.. హాలీవుడ్ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానని తన మనసులోని కోరికను బయటపెట్టారు.ఇంకా అలాగే నాటు నాటు పాటను ఉక్రెయిన్ అద్యక్షుడి ఇంటి ముందు 15 రోజులపాటు చిత్రీకరించామని ఆ పాటకి ఏకంగా ఏడు రోజులు రిహార్సిల్స్ చేశామన్నారు. ఆస్కార్ అవార్డుకు ఈ సాంగ్ నామినేట్ కావడం చాలా ఆనందంగా ఉందని.. ఇది భారతదేశ సినీ పరిశ్రమ సాధించిన గొప్ప విజయమని అన్నారు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: