"సెల్ఫీ" మూవీ రిజల్ట్ కోసం రామ్ చరణ్ వెయిటింగ్ !

VAMSI
కొంతకాలం నుండి ఇటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ పరిశ్రమలు రీమేక్ సినిమాల మీదనే తమ దృష్టిని కేంద్రీకరించాయి. ముఖ్యంగా మాలీవుడ్ లో హిట్ అయిన సినిమాల రీమేక్ హక్కులను దక్కించుకుని సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ఆ విధంగా కేరళ సినిమా పరిశ్రమ నుండి టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో మెరిశాయి. తాజాగా మరో సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి ఈ రోజు థియేటర్ లలో విడుదల చేశారు. మలయాళంలో 2019 లో విడుదలై బంపర్ హిట్ ను అందుకున్న డ్రైవింగ్ లైసెన్స్ సినిమా గురించి తెలిసిందే. అప్పటి నుండి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఎందరో హక్కుల కోసం ప్రయత్నించారు.
చివరికి ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేతికి వెళ్లాయి. అయితే ఎందుకో రామ్ చరణ్ ఈ సినిమాను తీయడానికి ఇంకా వెనకడుగు వేస్తూనే ఉన్నాడు. అంతకు ముందు ఒకసారి ఈ సినిమాను మొదలెట్టడానికి హీరోల కోసం ప్రయత్నాలు కూడా మొదలెట్టాడు. అందులో భాగంగా రవితేజ, రానా , వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లాంటి వాళ్ళను అనుకుని మళ్ళీ ఆగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా బాలీవుడ్ లోనూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.. డ్రైవింగ్ లైసెన్స్ ను సెల్ఫీ పేరుతో ఈరోజు విడుదల చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ సినిమా స్టార్ గా నటించగా, ఇమ్రాన్ హష్మీ ఆర్ టి ఓ అధికారిగా నటించారు.
అయితే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే పెద్దగా వర్క్ అవుట్ అయ్యేలా లేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమాకు వచ్చే స్పందన మరియు వసూళ్లను చూసి తెలుగు రీమేక్ చేసే విషయం గురించి నిర్ణయం తీసుకుంటారట. ఒకవేళ సెల్ఫీ మూవీ ప్లాప్ అయితే మాత్రం రీమేక్ హక్కులను కొనుగోలు చేసినందుకు అయిన డబ్బును నష్టపోయినా పర్వాలేదు.. సినిమా చేసేంత సాహసం చేయరని టాక్ వినిపిస్తోంది. మరి ఏమి జరుగుతుంది అన్నది తెలియాలంటే .. మరో రెండు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: