అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం..?

Purushottham Vinay
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక  అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వంపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఏకంగా ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకోనున్నట్లు వెల్లడించి అందిని కూడా పెద్ద షాక్ గు గురి చేశాడు. అక్షయ కుమార్ పై ఎప్పటి నుంచో కెనడా పౌరసత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీధీ బాత్ కొత్త సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో మెయిన్ గెస్ట్ గా వచ్చిన అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వాన్ని వదులుకోనున్నట్లు చెప్పాడు. ఇంకా అంతేకాదు.. అసలు తాను ఎందుకు కెనడా పౌరసత్వం తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పాడు.ఇండియానే నాకు సర్వస్వం.. ఇక నేను సంపాదించినదంతా ఇక్కడి నుంచే.. ఏమి సాధించినా కూడా అన్నీ ఇక్కడ నుంచే.. ఇక నేను పొందిన దానిని తిరిగి నా దేశానికి ఇచ్చే అదృష్టం కూడా నాకు దక్కింది.


అసలు తన గురించి ఏమీ తెలియకుండా మాట్లాడే మాటలు తనకు ఎంతగానో బాధని కలిగిస్తాయని చెప్పాడు.అయితే అక్షయ్ కుమార్ తన పౌరసత్వాన్ని వదులుకుంటానని ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం కూడా కాదు. గతంలో అనగా 2019 వ సంవత్సరంలో లోక్ సభ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్షయ్ కుమార్ పౌరసత్వంపై పెద్ద దుమారం రేగింది. అప్పటి నుంచి అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం వివాదం అప్పుడప్పుడు తెరమీదకు వస్తూనే ఉంది.ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ హీరోగా దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఈమధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తున్న ఒక్క హిట్ పడలేదు. అన్ని చాలా ఘోరంగా ప్లాప్ అయ్యాయి. అసలు అక్షయ్ సినిమా టైటిల్స్ కూడా ఎవరికీ గుర్తు లేవు. అన్ని సినిమాలు వరుసగా రిలీజ్ చేసి ప్లాప్స్ మూటగట్టుకుంటున్నాడు.ఇప్పుడు సెల్ఫీ సినిమాతో రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: