డిఫరెంట్ కంటెంట్ తో బాలీవుడ్ స్టార్ కిడ్ ఎంట్రీ?

Purushottham Vinay
బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ ఎంత బాగా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ రోల్ చేసిన జీవించిపోతాడు. కానీ రొమాంటిక్ హీరోగా మాత్రం చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇక సైఫ్ మొదటి భార్య అయిన అమృతాసింగ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కొత్త సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులుమనాలిలో ఇప్పుడు తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఈ సినిమాకి కాయోజే ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇబ్రహీం సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం లుక్ పరంగా ఇబ్రహీం అలీ ఖాన్ చాలా ఛెంజెస్ తీసుకొచ్చాడు. పూర్తిగా ఆహార నియమాలు పాటించి ఆరు నెలలు పాటు కఠోర సాధన చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే ఇబ్రహీం హిందీ లో రెండు..మూడు సినిమాలకి అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పనిచేసాడు.నిర్మాణ పరంగా కూడా ఇబ్రహీం కొంత అనుభవాన్ని సంపాదించాడు.

ఇలా కొంత అనుభవం తర్వాత తనను తాను హీరోగా హీరోగా నిరూపించుకోవడానికి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ యంగ్ హీరో బాధ్యతలు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అయితే కరణ్ జోహార్ తీసుకున్నారు. 'సర్జమీన్' టైటిల్ తో ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. వాస్తవానికి ఇందులో హీరోగా కొంత మంది కొత్త నటీనటులని తీసుకోవాలనుకున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ ఎంట్రీ తో ఆ ఛాన్స్ ఇప్పుడు ఇబ్రహీంకి వచ్చింది.ఇందులో హీరోయిన్ ఉంటుందా? ఉండదా? అన్నది ఇంకా సస్పెన్స్ గా మిగిలింది. కథ మాత్రం హీరో కొన్ని సపోర్టింగ్ రోల్స్ చుట్టూనే తిరుగుతుందిట.అందుకే ఈ సినిమాకి హీరోయిన్ అవసరం లేదు అన్న టాక్ వినిపిస్తుంది. అదే గనుక నిజమైతే ఈ యంగ్ హీరో తొలి సినిమాలోనే రొమాన్స్ మిస్ అయినట్లే. ఇందులో కాజోల్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: