అష్టా చెమ్మా to దసరా: నాని జర్నీ ఇదే..?

Purushottham Vinay
ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా టాలీవుడ్ లో నాని స్టార్ హీరోగా ఎదిగాడు. తనకంటూ ఒక స్టైల్, ఇమేజ్ ఇంకా సూపర్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు.ఇక నాని బాల్యం విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్ లోనే జరిగింది. ఈ క్రమంలో సినిమా మీదకు ఆయన మనసు మళ్లింది. ఇక చదువు పూర్తి కాగానే అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణంని మొదలుపెట్టాడు. లెజెండరి దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ గా చేరారు. ఆయన తెరకెక్కించిన రాధాగోపాళం చిత్రానికి కూడా నాని పనిచేశారు. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే హీరో కావాలని కొంతమంది ఆయన్ని ప్రోత్సహించారు.ఇక దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన అష్టా చెమ్మా మూవీలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు.మంచి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన అష్టాచెమ్మా అప్పట్లో చాలా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత స్నేహితుడు మూవీతో మరో హిట్ కొట్టాడు. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది సినిమా అయితే నానికి మంచి క్లాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.


అత్యంత సహజంగా ఉండే నాని నటన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యేలా చేసింది.తరువాత పిల్లజమీందార్, ఈగ ఇలా వరుస హిట్స్ పడ్డాయి. ఇక దర్శకుడు రాజమౌళి ఛాన్స్ ఇవ్వడం నిజంగా నానికి గొప్ప పరిణామం. ఆయన ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈగ సినిమా నానికి ఎక్కడలేని ఫేమ్ తెచ్చింది. అందులో నాని పాత్ర నిడివి తక్కువే అయినా చాలా అద్భుతమైన లవ్ ట్రాక్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈగ సినిమా తర్వాత నాని వరుసగా ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. ఒక దశలో కెరీర్ ముగుస్తుందేమో భయపడ్డాడు. అయితే ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తరువాత తనకు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి జెంటిల్ మెన్ తో మరో హిట్ ని ఇచ్చారు. ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ చేశారు. అప్పటినుండి మినిమమ్ గ్యారంటీ హీరోగా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళుతున్నాడు.నాని లేటెస్ట్ మూవీ దసరా సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 30 వ తేదీన దసరా విడుదల కానుంది.ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: