బ్యాక్ టూ బ్యాక్ మువీస్ తో రాబోతున్న ప్రభాస్....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా పేరుపోయిండిన హీరో ప్రభాస్.ఆయన హీరో గా  ప్రెసెంట్ నాలుగైదు సినిమాలు రూపొందుతున్నాయి. ఐతే ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ టైంలో విడుదలకు సంబంధించిన అప్డేట్స్ అధికారికంగా రాలేదు కానీ కాకపోతె వచ్చే పది నెలల టైం లో వరుసగా మూడు సినిమాల తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ఐతే అందులో మొదటగా ఈ సమ్మర్ చివర్లో ఆదిపురుష్ మూవీ తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హిందీ లో రూపొందిన ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం అందరికి తెల్సిందే. ఇక దసరా తర్వాత లేదా దసరాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఐతే మొత్తానికి ఈ మూడు సినిమాలు కూడా పది నెలల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో అభిమానులు పండగ చేసుకునే అవకాశం ఉంది. ఐతే ఈ మూడు సినిమాల విడుదల తేదీలు కన్ఫమ్ అయ్యాయి. అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. కాస్త అటు ఇటు తేదీలు మారే అవకాశాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అభిమానుల హృదయాలను గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ మూడు సినిమాలు ఉండి ప్రభాస్ ఇమేజ్ ని మరింతగా పెంచుతాయని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. భారీ అంచనాల నడుమ పాన్ వరల్డ్ సినిమాగా రుపొందుతున్న ప్రాజెక్ట్ కే సంక్రాంతి కి విడుదల అయితే ఇతర హీరోల సినిమాలేవి కూడా ప్రభాస్ సినిమా కు పోటీగా వచ్చే అవకాశం లేదు. ఇక ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాయో ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఐతే మూడు సినిమాలు కూడా వేల కోట్ల రూపాయల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఐతే అన్నీ సినిమాలు కూడా ఒక రేంజ్ లో వసూళ్లను రాబడతాయని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: