RRR: అక్కడ రీరిలీజ్.. అదరగోడుతున్న కొత్త ట్రైలర్?

Purushottham Vinay
RRR: అక్కడ రీరిలీజ్.. అదరగోడుతున్న కొత్త ట్రైలర్?

పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న ఎస్ ఎస్ రాజమౌళి లేటెస్ట్ గా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ప్రపంచం మొత్తం తెలుగు వైపు చేసేలా చేసింది ఈ మూవీ. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీగా పేరు తెచ్చుకుంది ఆర్ఆర్ఆర్ మూవీ.మరో 20 రోజుల్లో ఆస్కార్ అవార్డ్ అందుకోవడానికి సిద్ధం అవుతోంది. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు అందుకోవడమే కాదు..ఏకంగా ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది. తప్పకుండా ఆస్కార్ సొంతం చేసుకుంటుందని అంతా కూడా ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా చాలా అద్భుతంగా నటించి ఔరా అనిపించారు.


ఇక ఈ మూవీని ఆస్కార్ ముందు మరోసారి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మార్చి 3 న మరోసారి 200 థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఒక నిమిషం 40 సెకండ్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ లో అదిరిపోయే విజువల్స్ ఇంకా ఫైటింగ్ సీన్స్ చూపించారు. ఇదిలా ఉంటే స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ ను మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కించుకొని ఆస్కార్ నామినేషన్ తో పాటు విదేశాలలో అనేక అవార్డులకు కూడా నామినేట్ అయ్యి గెలుచుకుంది ఆర్ఆర్ఆర్. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ నటుడి విభాగంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా నామినేట్ అయ్యారు.
చూడాలి మళ్ళీ ఆర్.ఆర్.ఆర్ ఇంకెన్ని మనసులు దోచుకుంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: